నరసాపురం డిపో నుంచి అంతర్వేది తిరునాళ్లకు ఈ నెల 7, 8 తేదీల్లో 10 బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ సత్తి సుబ్బన్న రెడ్డి తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ప్రకటన విడుదల చేశారు. భీమవరం డిపో నుంచి 15 బస్సులు, తణుకు డిపో నుంచి 5 బస్సులు, తాడేపల్లిగూడెం 5 బస్సులు నడుపుతున్నామన్నారు. పాలకొల్లు డిపో నుంచి 10 ని. కు ఒక బస్సు నడపడం జరుగుతుందన్నారు.