గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైనా అపరిచిత వ్యక్తులు కనిపిస్తే తక్షణమే తమకు సమాచారం ఇవ్వాలని సిఐ ప్రభాకర్ రావు తెలిపారు. సోమవారం భోగాపురంలో ఆయన సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమం చేపట్టారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా విద్యార్థులు భవిష్యత్తుకు మంచి బాటలు వేసుకోవాలని తెలిపారు.