నెల్లిమర్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలను డీఈవో యు. మాణిక్యం నాయుడు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పదవ తరగతి స్పెషల్ క్లాస్ నిర్వహిస్తున్న తీరును గమనించారు. ఆ సమయానికి సగం మంది విద్యార్థులు మాత్రమే హాజరవడాన్ని గమనించిన ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పిల్లలు సమయానికి హాజరయ్యేటట్టు చూడాలని ఆదేశాలు ఇచ్చారు. ఉపాధ్యాయులందరూ పాఠశాలకు కనీసం 15 నిమిషాల ముందు హాజరు అవ్వాలని ఆదేశించారు.