బహుళ పంటల విధానంపై రైతులు ప్రత్యేక దృష్టి సారించాలని ప్రకృతి వ్యవసాయం ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ ప్రకాష్ తెలిపారు. శనివారం జామి మండలం సిరికి పాలెంలో మామిడి, జీడి తోటల్లో ఆర్డీఎస్ విధానంలో తెల్లజొన్న, రాగులు, సజ్జలు తదితర పంటలను రైతులతో వేయించారు. బహుళ పంటలు వేయడం వల్ల రైతుకు అధిక ఆదాయంతో పాటు ప్రధాన పంటను ఆశించే చీడపీడలు నివారించవచ్చని తెలిపారు. యూనిట్ ఇన్ ఛార్జ్ చరణ్ తదితరులు పాల్గొన్నారు.