రబీ పంటలు పండిస్తున్న రైతులంతా ఈ కేవైసీ చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి బి టి రామారావు కోరారు. గురువారం ఆయన నెల్లిమర్ల మండలం సీతారామునిపేట, సతివాడ తదితర గ్రామాలలో పర్యటించి రబీ పంటలైన మొక్కజొన్న, జిడి, వరి పంటలను పరిశీలించారు. అనంతరం పంటల సస్యరక్షణ పద్ధతులను రైతులకు వివరించారు. రైతులు ఈ కేవైసీ చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. ఇప్పటివరకు ఎంతమంది ఈ కేవైసీ చేసుకున్నారని ఆరా తీశారు.