నెల్లిమర్ల: పరిశుభ్రత జీవితంలో భాగం కావాలి
By k.chetan 85చూసినవారువ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత ప్రతీఒక్కరి జీవితంలో భాగం కావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోరారు. మన ప్రాంతం, మన రాష్ట్రం స్వచ్ఛదనంతో ఉన్నప్పుడే స్వర్ణాంధ్ర సాధన సాధ్యమవుతుందని అన్నారు. ప్రతీఒక్కరూ స్వచ్ఛాంధ్ర సాధనలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గుర్ల మండలంలో శనివారం జరిగిన స్వచ్ఛాంధ్ర-స్వచ్ఛదివస్ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు.