నెల్లిమర్ల: గోకులం షెడ్లను పరిశీలించిన డ్వామా పీడీ

84చూసినవారు
నెల్లిమర్ల: గోకులం షెడ్లను పరిశీలించిన డ్వామా పీడీ
నెల్లిమర్ల మండలం జగ్గరాజుపేట లో ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మించిన గోకులం షెడ్లను డ్వామా పిడి శారదా దేవి మంగళవారం పరిశీలించారు. షెడ్లు నిర్మాణంలో నాణ్యత ప్రమాణాల పాటించాలని కోరారు. పాడి రైతులు గోకులం షెడ్లను సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఇంకా నిర్మాణం చేపట్టని పాడి రైతులు సత్వరమే గోకులం షెడ్లను నిర్మించే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు.

సంబంధిత పోస్ట్