నెల్లిమర్ల: గ్రామాల్లో బెల్ట్ షాపులపై దృష్టి సారించండి

71చూసినవారు
నెల్లిమర్ల: గ్రామాల్లో బెల్ట్ షాపులపై దృష్టి సారించండి
గ్రామీణ ప్రాంతాల్లో చట్ట వ్యతిరేకంగా నిర్వహిస్తున్న బెల్ట్ షాపులపై దృష్టి సారించాలని నెల్లిమర్ల ఎస్ ఐ గణేష్ కోరారు. గురువారం ఆయన పోలీస్ స్టేషన్లో మహిళా పోలీసులతో సమావేశం నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు తావు లేకుండా చూడాలని తెలిపారు. ఎవరైనా అక్రమంగా బెల్ట్ షాపులు నిర్వహించినా, గ్రామాల్లో శాంతిభద్రతలకు ఎవరైనా విఘాతం కలిగించినా సమాచారం ఇవ్వాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్