ఉపాధి హామీ పథకానికి సంబంధించి అర్హులైన వారికి జాబ్ కార్డులు మంజూరు చేసి పని కల్పించాలని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి అధికారులను కోరారు. నెల్లిమర్ల మండలం ముంజేరు ఆమె క్యాంప కార్యాలయంలో శనివారం మండలంలో గల ఫీల్డ్ అసిస్టెంట్ల తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉపాధి హామీ పనులను అధికారులు పారదర్శకంగా నిర్వహించాలని తెలిపారు. ఉపాధి హామీ పనుల్లో అవకతవకలు జరిగితే సహించేది లేదని హెచ్చరించారు.