ఇటీవల తగరపువలస మిరాకిల్ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్న భోగాపురం మండలం ముంజేరుకు చెందిన శివగణేషన్ రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే. క్షతగాత్రుడు తగరపువలస ఎన్నారై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈమేరకు ఎమ్మెల్యే లోకం నాగ మాధవి సోమవారం ఆయనను పరామర్శించి, వైద్యానికి అయ్యే ఖర్చు భరిస్తానని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. ప్రమాద బాధితుడికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని వైద్యులకు ఆదేశించారు.