నెల్లిమర్ల: సూర్య ఘర్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి

50చూసినవారు
నెల్లిమర్ల: సూర్య ఘర్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి
పీఎం సూర్య ఘర్ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నెల్లిమర్ల మండల ఏ పీ వో బంగారమ్మ పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక మండల సమాఖ్య కార్యాలయంలో పి ఓ ఏ లకు పిఎం సూర్య ఘర్ యోజన పథకంపై అవగాహన చేపట్టారు. గృహ వినియోగదారులపై విద్యుత్ భారం తగ్గించేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు. తొలి విడతలో లక్ష మంది డ్వాక్రా మహిళలకు సోలార్ ప్యానళ్ళను అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్