కొత్తపేటలో సారాబట్టిపై పోలీసుల దాడులు

80చూసినవారు
నెల్లిమర్ల మండలం కొత్తపేట పంచాయతీ పరిధి అప్పయ్యపేటలో నాటు సారా బట్టీలపై గురువారం రాత్రి పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 250 లీటర్ల బెల్లం ఊట, తయారు చేయడానికి ఉంచిన బెల్లాన్ని ధ్వంసం చేసినట్లు ఎస్ఐ రామ గణేష్ వెల్లడించారు. నాటుసారా తయారు చేసినా, అక్రమంగా మద్యం విక్రయాలు జరిపినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దాడుల్లో ఎఎస్ఐ మూర్తి, సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :