భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు శనివారం కొత్తవలస మండలం మంగళపాలెం లోని శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ ను సందర్శించారు. అనంతరం ఆయన శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన వంద పడకల క్యాన్సర్ ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వికలాంగులకు కృత్రిమ అవయవాలు పంపిణీ తదితర సేవా కార్యక్రమాలు అభినందనీయమైనవి అన్నారు