నెల్లిమర్ల లోని ఏపీ ఎం జె పి గురుకుల పాఠశాలలో జోన్ - 1 క్రీడా పోటీలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. జోన్ - 1 పరిధిలో విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన 14 పాఠశాలలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు క్రీడా పోటీలలో పాల్గొన్నారు. ముందుగా క్రీడాకారులు క్రీడా మార్చ్ నిర్వహించారు. అనంతరం ప్రిన్సిపాల్ కె బి బి రావు, నైస్ ప్రిన్సిపల్ శ్రీనివాసరావు, ఎస్ఎంసి చైర్మన్ ప్రసాద్ పోటీలను ప్రారంభించారు.