వీరఘట్టం మండలంలో అక్రమంగా తరలిస్తున్న 2000 కేజీల పీడీఎఫ్ బియ్యాన్ని సీజ్ చేసినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్సై బి. రామారావు గురువారం తెలిపారు. తమకు వచ్చిన సమాచారం మేరకు. అచ్చెపువలస గ్రామ సమీపంలో వీరఘట్టం పోలీసుల సహకారంతో బొలెరో వాహనంలో తరలిస్తున్న బియ్యాన్ని, వాహనాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.