పాలకొండ నియోజకవర్గం కూటమి జనసేన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణను సీఐటీయూ నాయకులు డి. రమణారావు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆశ వర్కర్లకు కనీస వేతనాలు చెల్లించాలని, కమ్యూనిటీ హెల్త్ వర్కర్లను ఆశ వర్కర్లుగా మార్పు చేయాలని, ప్రభుత్వ సెలవులు, రిటైర్మెంట్, గ్రూప్ ఇన్సూరెన్స్ కల్పించాలని పలు సమస్యలపై వినతి పత్రం అందించారు. ఆశ వర్కర్ల యూనియన్ జిల్లా అధ్యక్షుడు కే. గౌరీశ్వరి, సభ్యులు పాల్గొన్నారు.