పాలకొండలో ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ శనివారం మీడియాతో మాట్లాడారు. కూటమి నాయకులు ఎన్నికల్లో ప్రతీ ఇంటికి వెళ్లి నీకు 15 వేలు నీకు 18 వేలు అన్నారని కానీ ఇప్పుడు అవన్ని ఎక్కడకి పోయాయని అన్నారు. ఈ ఏడాది తల్లికి వందనం ఇవ్వటం లేదని కాబినెట్ సాక్షిగా చంద్రబాబు తేల్చి చెప్పేసారని ఎమ్మెల్సీ మండిపడ్డారు. దీనివల్ల పిల్లలు తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన అన్నారు.