పాలకొండ నగర పంచాయతీ పరిధి గారమ్మ కాలనీవాసులు గురువారం తాగునీటి కోసం ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. తాగునీటితో పాటు కాలనీలో రహదారులు, వీధి దీపాల పరిస్థితి అధ్వానంగా తయారైందని పలువురు మహిళలు అన్నారు. దేశం అంతా స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటున్నప్పటికీ. తాము నివసిస్తున్న ప్రాంతంలో కనీస సదుపాయాలు కరువయ్యాయని వాపోయారు. అధికారులు, పాలకులు దృష్టి సారించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.