భారత సైన్యానికి మద్దతుగా పాలకొండ పట్టణంలో తిరంగా యాత్ర ర్యాలీని పాలకొండ ఎమ్మెల్యే జయకృష్ణ శనివారం నిర్వహించారు. కోట దుర్గఆలయం నుండి ప్రారంభమైన ర్యాలీ మెయిన్ రోడ్డు మీదుగా ఆర్‌టిసి కాంప్లెక్స్ కూడలి వరకు సాగింది. కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీ నాయకులు, ప్రముఖ వ్యాపారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.