మిర్తివలన గ్రామ సచివాలయాన్ని సందర్శించిన కలెక్టర్

80చూసినవారు
మిర్తివలన గ్రామ సచివాలయాన్ని సందర్శించిన కలెక్టర్
బలిజిపేట మండలం మిర్తివలస గ్రామంలో ఉన్న సచివాలయాన్ని బుధవారం కలెక్టర్ ఏ. శ్యాం ప్రసాద్ సందర్శించారు. సచివాలయ సిబ్బంది హాజరు పట్టికలు వారి పనితీరు, డిజిటల్ లైబ్రరీ గూర్చి వెల్ఫేర్ పాలూరు శ్రావణిని అడిగి తెలుసుకున్నారు. రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం ఉపాధి హామీ కూలీల పనులను పరిశీలించారు. కొలతల ప్రకారం పనులు చేసుకుని గరిష్ట వేతనాన్ని పొందేలా చూడాలని సిబ్బందికి సూచించారు.

సంబంధిత పోస్ట్