పార్వతీపురం - మన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గం, వీరఘట్టం మండలం, వండువ గ్రామ సచివాలయ ప్రాంగణంలో గురువారం నిర్వహించిన "78వ స్వాతంత్ర్య దినోత్సవ" వేడుకలలో పాలకొండ నియోజకవర్గ గౌరవ మాజీ శాసన సభ్యురాలు & పాలకొండ నియోజకవర్గ వైఎస్సార్సీపీ పార్టీ ఇంచార్జ్ "శ్రీమతి విశ్వాసరాయి. కళావతి" గారు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించి, సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.