గరుగుబిల్లి మండలంలోని ఉల్లిభద్ర గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని ఆర్బిఎస్ కె ప్రోగ్రాం జిల్లా అధికారి డా. రఘుకుమార్ తనిఖీ చేశారు. ఈ సందర్బంగా అంగన్ వాడీ కేంద్రంలోని పిల్లల ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. పిల్లల ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గర్భిణీల్లో హైరిస్క్ ఆరోగ్య సమస్యలను గుర్తించాలని, రక్తహీనత గా గుర్తించిన వారికి హిమోగ్లోబిన్ వృద్ధి చెందే విధంగా కృషి చేయాలని అన్నారు.