పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలం నారాయణపురం వద్ద నిర్మితమైన వంతెన పనులను పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర శుక్రవారం సాయంత్రం పార్టీ నాయకులతో కలసి పరిశీలించారు. తెదేపా హయాంలో దీనికి శంకుస్థాపన చేసినప్పటికీ వైసీపీ ప్రభుత్వం దీన్ని పూర్తి చేయలేకపోయింది అక్కడ నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. శరవేగంతో పనులు జరిగేలా చూడాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.