పార్వతీపురం: వాతావారణ హెచ్చరికల నేపథ్యంలో తీవ్ర ఆందోళన

67చూసినవారు
పార్వతీపురం: వాతావారణ హెచ్చరికల నేపథ్యంలో తీవ్ర ఆందోళన
మన్యం జిల్లా రైతులను ఫెంగల్‌ తుఫాన్‌ భయం వెంటాడుతోంది. రానున్న రెండు రోజుల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందన్న సమాచారంతో వారిలో గుబులు రేగుతోంది. ఆరుగాలం కష్టపడి పండించిన వరి కోత దశకు వచ్చింది. గురువారం నాటికీ కొన్నిచోట్ల పొలాల్లోనే పంట ఉండగా.. వర్షాలు కురిస్తే పూర్తిగా నష్టం వాటిల్లే అవకాశముంది. ధాన్యం తడిసి రంగు మారి, తేమ పెరిగితే కొనుగోలు కేంద్రాలకు విక్రయించలేమని రైతులు ఆందోళన చెందుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్