పార్వతీపురం: గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలి

57చూసినవారు
పార్వతీపురం: గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలి
పార్వతీపురం ఐటిడిఎ పరిధిలో చేపడుతున్న పిఎం జన్‌మన్‌ గృహ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తిచేయాలని పిఒ అశుతోష్‌ శ్రీవాత్సవ ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన ఛాంబరులో గృహ నిర్మాణాలు, ఉపాధి హామీ పనులపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఐటిడిఎ పరిధిలో పిఎం జన్‌మన్‌ గృహ నిర్మాణాలపై అధికారులు మరింత ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గృహ నిర్మాణాలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాయని చెప్పారు. నిర్దేశించిన లక్ష్యాల మేరకు సకాలంలో పూర్తిచేయాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్