డెంగ్యూ అవగాహన దినోత్సవం సందర్భంగా శుక్రవారం గరుగుబిల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ సంతోష్ కుమార్, హోమియో వైద్యాధికారి కాసుల వర్మ ఆధ్వర్యంలో ప్రజలకు డెంగ్యూ వ్యాధి గురించి అవగాహన కల్పించారు. డెంగ్యూని ఎలా నివారించాలో తెలియజేస్తూ, వ్యాధి సోకితే ఎలా చికిత్స చేయించాలో అవగాహన కల్పించారు. డెంగ్యూ సోకితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలన్నారు.