మన్యం జిల్లాలో ఇద్దరు పంచాయతీ కార్యదర్శులు సస్పెన్షన్

59చూసినవారు
మన్యం జిల్లాలో ఇద్దరు పంచాయతీ కార్యదర్శులు సస్పెన్షన్
పించన్లలో అక్రమాలకు పాల్పడిన ఇద్దరు పంచాయతీ కార్యదర్శులు సస్పెన్షన్ చేస్తూ పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. పించన్లలో అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు రావడంతో విచారణ చేపట్టారు. ప్రాథమిక విచారణలో వాస్తవమని వెల్లడి కావడంతో పాచిపెంట మండలం కేసలి పంచాయతీ గ్రేడ్ 4 కార్యదర్శి సేనాపతి సునీత, గ్రేడ్ 5 గ్రామ కార్యదర్శి కోలక వాసులను సస్పెన్షన్ చేశారు.

సంబంధిత పోస్ట్