రాష్ట్రంలో రహదారులు, త్రాగునీరు, విద్యుత్ మొదలగు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. మౌలిక సదుపాయాల విషయంలో ఈ ఆరునెలల పాలనలో అద్భుత ఫలితాలను సాధించామని చెప్పారు. స్థానిక సోనియానగర్‌లో సుమారు రూ. 5. 19 కోట్ల ఖర్చుతో నిర్మించిన 33/11 కెవి విద్యుత్ సబ్‌స్టేషన్‌ను శుక్రవారం మంత్రి కొండపల్లి ప్రారంభించారు.