విద్యార్థుల్లో సృజనాత్మక శక్తిని పెంపొందించడానికి లీడ్ ఇండియా ఫౌండేషన్ ద్వారా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డా. బి. ఆర్ అంబెడ్కర్ తెలిపారు. మంగళవారం లీడ్ ఇండియా సంస్థ బృందం జిల్లా కలెక్టర్ ను కలసారు. పిల్లల్లో లీడర్ షిప్ లక్షణాలు, విలువలు, నైపుణ్యం, ఆలోచనా శక్తిని పెంచడం తదితర అంశాల పై అవగాహన కలిగించడానికి లీడ్ ఇండియా ద్వారా కృషి చేస్తున్నామన్నారు.