పన్ను వసూళ్ళను వేగవంతం చేయాలని రెవెన్యూ కార్యదర్శులకు విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ మల్లి నల్లనయ్య ఆదేశించారు. ఈ మేరకు శనివారం నగరపాలక సంస్థ కార్యాలయంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సచివాలయాల వారీగా ఇప్పటివరకు వసూలు చేసిన లక్ష్యాలను సమీక్షించారు. ఆస్తి, కులాయి, ఖాళీ స్థలముల పన్నులను త్వరితగతిన వసూలు చేయాలని చెప్పారు.