రాజాం పట్టణంలో కొలువై ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి ఆషాడ మాసం శుక్రవారం మహిళలు విశేష పూజలను జరిపారు. ప్రాత కాలంలో దేవాలయ అర్చకులు అమ్మవారికి అష్టోత్తర శతనామావళితో లలితా సహస్ర నామావళితో పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అమ్మవారిని భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మహిళలు అమ్మవారికి కుంకుమ పూజలను నిర్వహించారు. భక్తులు సామూహిక లలితా సహస్రనామ పారాయణ భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.