జూలై రెండవ వారంలో మడ్డువలస ప్రాజెక్టు నీరు విడుదల

63చూసినవారు
జూలై రెండవ వారంలో మడ్డువలస ప్రాజెక్టు నీరు విడుదల
వంగర మండలంలోని మడ్డువలస ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల నుంచి పంట పొలాలకు సాగునీరు జూలై రెండవ వారంలో విడుదల చేయనున్నట్లు ప్రాజెక్టు అధికారులు మంగళవారం వెల్లడించారు. ఉమ్మడి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలోని ఆరు మండలాల్లో 30 వేల 077 ఎకరాలు సాగు భూమికి కుడి ఎడమ కాలువల ద్వారా నీరు సరఫరా కానుంది. తొలి విడతగా 14 గ్రామాల్లోని 24, 877 ఎకరాల ఆయకట్టు భూములకు సాగునీరు అందించనున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్