దోమల నియంత్రణకు అన్ని చర్యలు చేపడుతున్నామని, ప్రజలు కూడా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎం ఎం నాయుడు తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ, దోమల వృద్ధి కేంద్రాలను గుర్తించి నియంత్రణా చర్యలు ఇప్పటికే ముమ్మరం చేసామని, అన్ని డివిజన్లో ఫాగింగ్ చేపడుతున్నామన్నారు. రోజుకొక డివిజన్ చొప్పున అన్ని డివిజన్లో ఫాగింగ్ పూర్తి చేసేందుకు ప్రణాళిక బద్ధంగా వ్యవహరిస్తున్నామని తెలిపారు.