టీడీపీ సీనియర్ నేత, మాజీ తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ కొల్ల అప్పలనాయుడు తండ్రి సూర్యనారాయణ (94) అనారోగ్యంతో బాధపడుతూ తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు సంతకవిటి మండలం మామిడిపల్లిలో బుధవారం సూర్యనారాయణ పార్థవదేహానికి ఎమ్మెల్యే కోండ్రు మురళిమోహన్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కొల్ల కుటుంబాన్ని పరామర్శించి, ప్రగాఢసానుభూతిని తెలిపారు. ఈ పరామర్శ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.