రాజాంలో వెలసివున్న పోలిపల్లి పైడితల్లి అమ్మవారి మహోత్సవాలు మార్చి 9 నుండి 11 వరకు నిర్వహించనట్లు ఆలయ ఈవో బీవి మాధవరావు తెలిపారు. ఈ మేరకు రాజాంలో బుధవారం అమ్మవారి జాతర ముహూర్తపురాట వేశారు. అనంతరం ఉత్సవాల గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త వాకిచర్ల దుర్గాప్రసాద్, పెంకి చైతన్యకుమార్, తదితరులు పాల్గొన్నారు.