గీతకులాలకు కేటాయించిన మద్యం దుకాణాల దరఖాస్తులకు ఈనెల 8 వరకు గడవు పొడిగించిన్నట్లు ఎక్సైజ్ సీఐ ఆర్. జైభీమ్ బుధవారం తెలిపారు. రాజాం ప్రోహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గల కల్లుగీతకులాలకు కేటాయించిన 3 మద్యం షాపులకు ఆన్ లైన్ లో లేదా ఎక్సైజ్ కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. అనంతరం ఈనెల 10న లాటరీ పద్ధతిలో విజేతలను నిర్ణయిస్తామన్నారు. ఈ అవకాశాన్ని గీతకులాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.