ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఆదివారం విజయనగరంలో జరుగు మాలల సింహ గర్జనకు దళిత బహుజనులంతా భారీగా తరలిరావాలని శనివారం సమాత సైనిక్ దళ్ నాయుకుడు గెడ్డాపు నీలకంఠం(బుజ్జి) కోరారు. ఈ మేరకు రాజాం మండలం వంజారంపేట గ్రామంలో కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ త్యాగాల బాట, రేపటి పిల్లల భవిష్యత్తు కోసం, మాలలంతా ఐక్యంగా వర్గీకరణను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.