రాజాం మండలంలోని మొగిలివలస ఎంపీపీ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని శుక్రవారం ఎంఈఓ దుర్గారావు పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనాన్ని చేసి వంటకాల రుచులను తెలుసుకున్నారు. భోజనానంతరం సంతృప్తిని వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజన పథకంలో రాజీ లేకుండా నాణ్యమైన ఆహారాన్ని విద్యార్థులకు అందించాలని తెలిపారు. విద్యార్థులు ఉపాధ్యాయుల హాజరు పట్టికలను పరిశీలించారు.