రాజాం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకాన్ని ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పథకం ద్వారా విద్యార్థులకు సమయం కేటాయించి, టీచర్లకు బోధించేందుకు సహాయం చేస్తుందని చెప్పారు. ప్రైవేట్ కళాశాలలకు సమానంగా ప్రభుత్వ కళాశాలలు అభివృద్ధి చేయడమే లక్ష్యమని తెలిపారు. అనంతరం విద్యార్థులతో కలిసి ఆయన భోజనం చేశారు.