రాజాం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజనం పథకాన్ని ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పథకం విద్యార్థులకు ఎంతో ఉపయుక్తకరంగా ఉంటుందని అన్నారు. ప్రైవేట్ కళాశాలలకు ధీటుగా ప్రభుత్వ కళాశాలను తీర్చిదిద్దడమే ధ్యేయంగా లోకేష్ ఈ నిర్ణయం తీసుకున్నారని అన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే భోజనం చేశారు.