రాజాం ప్రాంతీయ ఆసుపత్రిలో శనివారం ఏర్పాటు చేసిన ఆసుపత్రి అభివృద్ధి సంఘ సమావేశంలో నియోజకవర్గ ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రి సిబ్బంది ఇది మనది అనుకుని పనిచేయాలని వైద్య సేవలో ఎటువంటి రాజీ లేకుండా పనిచేసి పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలని కోరారు ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని ఆశపత్రి అభివృద్ధి కృషి చేయాలని అన్నారు.