రాజాం పట్టణంలోని శుక్రవారం ఎమ్మెల్యే కొండ్రు మురళి ప్రజాదర్భార్ కార్యక్రమం నిర్వహించి ప్రజలనుంచి వినతులు స్వీకరించారు. 50కి పైగా వచ్చిన వినతులలో ఎక్కువగా రోడ్లు, కాలువలు, వీధిలైట్లు, రెవెన్యూ సమస్యలపై అందినట్లు తెలిపారు. గతంలో ఇచ్చిన వినతులను 90 శాతం వరకు పరిష్కరించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్య కర్తలు, అభిమానులు పాల్గొన్నారు.