సంతకవిటి తహసీల్దార్ కార్యాలయాన్ని శుక్రవారం ఆర్డిఓ బి. ఆశయ్య సందర్శించారు. ఈ మేరకు మండలంలోని రీ సర్వే, వాటర్ టెక్స్ బిల్లు, తదితర అంశాలు పై గ్రామ రెవిన్యూ అధికారులుతో సమావేశం నిర్వహించారు. అనంతరం పలు రికార్డులను పరిశీలించి సంతృప్తి చెందారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ బి. సత్యం, డీటీ రంజిత్ కుమార్, ఆర్ఐ కృపారావు, తదితరులు పాల్గొన్నారు.