సంతకవిటి మండలం మండవకురిటి గ్రామంలో మత్తు పదార్థాలు, సైబర్ నేరాలపై గురువారం ప్రజలకు రాజాం రూరల్ సీఐ ఉపేంద్ర సంకల్పం కార్యక్రమం ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ మత్తుకు బానిసై జీవితాలు నాశనం చేసుకోవద్దన్నారు గంజాయి రవాణా లేదా వినియోగం చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సైబర్ నేరాల పట్ల కూడా ప్రజల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.