భూ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రభుత్వo రెవెన్యూ సదస్సులకు శ్రీకారం చుట్టిందని సంతకవిటి తహశీల్దార్ బి. సత్యం అన్నారు. శనివారం సంతకవిటి మండలం మందరాడ, చిన్నయ్యపేట గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఈ మేరకు ప్రజల నుండి వచ్చిన పలు సమస్యలుపై వినతులను తహశీల్దార్ స్వీకరించారు. అనంతరం ఆర్జీలను ఆన్ లైన్ లో నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీటీ మధు, ఆర్ఐ కృపారావు తదితరులు పాల్గొన్నారు.