సావిత్రి బాయి పూలే 194వ జయంతి వేడుకలు రాజాంలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు, ఈ సందర్బంగా బిఎస్పి రాజాం నియోజకవర్గం ఇన్ ఛార్జ్ బోత్స బుద్ధుడు మాట్లాడుతూ ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందన్నారు. మొదటి మహిళా ఉపాధ్యాయురాలు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జే. నీలయ్య, కుప్పిలి ఆన్నారావు, తేగల మోహన్, రాము, లక్ష్మణరావు పాల్గొన్నారు