ప్రతి ఉపాధి శ్రామికుడికి 100రోజులు పని కల్పించాలని పీడీ ఎస్. శారదా దేవి అన్నారు. శుక్రవారం సంతకవిటి మండలం చిత్తారపురంలో జరుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించారు. అనంతరం సంతకవిటి ఎంపీడీఓ కార్యాలయంలో టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లులతో సమావేశం నిర్వహించారు. ఫారం పాండ్స్, హార్టికల్చర్ పథకాలు లక్ష్యం చేరాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సురేష్ కుమార్, ఎపిఓ హరినాధ్ తదితరులు పాల్గొన్నారు.