రాజాం నియోజకవర్గములో మంగళవారం ఎండలు మండు తున్నాయి. వృద్ధులు, చిన్నపిల్లలు ఎండకు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రజలు గొడుగు సహాయంతో బైటకు వస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షానికి వాతావరణం కొంతమేర చల్లబడినట్లు అనిపించినా, ప్రస్తుతం మళ్ళీ ఎండలు భగ్గుమంటున్నాయి. ఆకాశం మేఘావృతమై మళ్లీ ఎప్పుడు వర్షాలు కురుస్తాయో అని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. మళ్లీ ఒకటి రెండు వర్షాలు కురిస్తే వాతావరణం చల్లబడుతుంది.