వాహన చోదకులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని వంగర ఎస్సై షేక్ శంకర్ తెలిపారు. గురువారం వంగర మండల కేంద్రంలో గల రహదారిలో వాహన తనిఖీలు నిర్వహించారు. హెల్మెట్లు వినియోగం లేని వారికి జరిమాన తప్పదు అన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు ఉంటాయన్నారు. వాహనాల నడిపేవారు లైసెన్స్ తప్పనిసరి అన్నారు. మైనర్స్ వాహనాలు నడిపితే వాహనము గలవారు పట్ల తగు చర్యలు ఉంటాయన్నారు. ఈ తనిఖీల్లో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.