వంగర: ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు

52చూసినవారు
వంగర: ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు
దళిత బహుజన జెఏసి నాయకులు, ఉద్యోగులు ఆధ్వర్యంలో శుక్రవారం వంగర మండలం కేంద్రంలో సావిత్రిబాయి పూలే జయంతి ఘనంగా జరిగింది. ముందుగా సావిత్రిబాయిపూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మండల విద్యాశాఖ అధికార పి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ భారతదేశంలో మొదటి మహిళ ఉపాధ్యాయుని సావిత్రిబాయి పూలే ఎన్నో సేవలు అందించారని కొనియాడారు. ఆమె ఆశయ సాధనకు దళిత బహుజనులంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్